ఓ మై గాడ్.. వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి: ప్రియాంక గాంధీ సెటైర్

ఓ మై గాడ్.. వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి: ప్రియాంక గాంధీ సెటైర్
  • యువతుల వస్త్రధారణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రావత్
  • మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని వ్యాఖ్య
  • మోదీ, గడ్కరీ ఆరెస్సెస్ నిక్కర్లు వేసుకున్న ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక
యువతులు మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరిస్తున్నారంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కౌంటర్ వేశారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో మోకాళ్లకు పైగా ఖాకీ నిక్కర్లను ధరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'ఓ మై గాడ్... వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి' అని కామెంట్ చేశారు. కొంత కాలం క్రితం వరకు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ యూనిఫామ్ లో భాగంగా తెల్లటి చొక్కా, ఖాకీ నిక్కరు ధరించేవారు. ఇటీవలే నిక్కరు స్థానంలో ప్యాంటు వేసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.


More Telugu News