వైసీపీ మూకల దాడిలో టీడీపీ కార్యకర్త కృష్ణారావు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది: లోకేశ్
- సత్తెనపల్లె రూరల్ కార్యకర్త మృతి
- వైసీపీ నేతలే కారణమన్న లోకేశ్
- కృష్ణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని వెల్లడి
- నియంత పాలనను అంతమొందిస్తామని ఉద్ఘాటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్ పైనా, వైసీపీ పైనా ధ్వజమెత్తారు. సత్తెనపల్లె రూరల్ మండలం లక్కరాజుగార్లపాడు టీడీపీ కార్యకర్త గరికపాటి కృష్ణారావు హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కృష్ణారావు కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఫ్యాక్షన్ పోకడలతో ప్రభావితం చేసిన జగన్... నామినేషన్ వేశారన్న కారణంతో కొందరిని చంపేశారని ఆరోపించారు. వైసీపీకి ఓట్లు వేయకపోతే పథకాలు తీసేస్తామని వలంటీర్ వ్యవస్థతో బెదిరించి మరీ ఓట్లేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన టీడీపీ మద్దతుదారులను చివరికి అంతం చేస్తున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా తెలుగుదేశం భయపడదని, టీడీపీ కార్యకర్తలు భయపడరని ఉద్ఘాటించారు. నీ నియంత పాలనను అంతమొందించే వరకు పోరాడుతూనే ఉంటాం అని సీఎం జగన్ కు స్పష్టం చేశారు.