అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం వద్ద దుండగుడి కలకలం!

  • మసాచుసెట్స్ లో ఘటన
  • కమల నివాసం వద్ద తుపాకీతో వ్యక్తి
  • దుండుగుడిని పాల్ ముర్రేగా గుర్తింపు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అత్యాధునిక తుపాకీ, మందుగుండు స్వాధీనం 
గత కొన్నిరోజుల వ్యవధిలో అమెరికాలో పలుచోట్ల తుపాకీ కాల్పుల కలకలం రేగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడం ఆందోళనకు గురిచేసింది. అతడిని పాల్ ముర్రే (31)గా గుర్తించారు.

టెక్సాస్ కు చెందిన అతడు వాషింగ్టన్ లోని మసాచుసెట్స్ అవెన్యూలో ఉన్న కమలా హారిస్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు పాల్ ముర్రే వాహనం నుంచి అత్యాధునిక రైఫిల్ (షాట్ గన్), మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. ఆ తుపాకీకి లైసెన్స్ లేదని వారు తెలిపారు. పాల్ ముర్రేను మెట్రోపాలిటన్ పోలీసులకు అప్పగించారు.


More Telugu News