చొరబాటుదారులకు సహాయం చేసేవారిపై సౌదీ ఉక్కుపాదం

  • సౌదీలోకి నానాటికీ పెరుగుతున్న చొరబాట్లు
  • కట్టడి చేసేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం  
  • 15 ఏళ్ల జైలు శిక్ష, మిలియన్ రియాళ్ల జరిమానా
తమ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారిని కట్టడి చేసేందుకు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. చొరబాటుదారులు, కార్మికులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు, వారికి ఆశ్రయం కల్పించేందుకు సాయం చేసే వారిపై ఉక్కుపాదం మోపబోతోంది. వారికి సాయం చేస్తూ పట్టుబడితే 15 ఏళ్ల జైలు శిక్ష, మిలియన్ రియాళ్ల జరిమానా విధిస్తామని సౌదీ అధికారులు కీలక ప్రకటన చేశారు. మిలియన్ రియాళ్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఒక కోటి 93 లక్షల రూపాయలు.

సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చొరబాటుదారులకు దేశంలోకి ప్రవేశించేందుకు సాయం చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం వంటి చట్ట విరుద్ధమైన పనులను కొందరు చేస్తున్నారు. దీంతో వీరిపై కొరడా ఝుళిపించేందుకు సౌదీ సిద్ధమైంది. అక్రమ చొరబాట్లకు సహకరిస్తున్న దేశ పౌరులు, ఇక్కడ నివసిస్తున్నవారు ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించింది. తప్పు చేస్తూ పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.


More Telugu News