తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య
- కుటుంబ కలహాలతో మనస్తాపం
- పురుగుల మందు తాగి ఆత్మహత్య
- కవిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు
పెద్దల మాట చద్దిమూట, మద్దావారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేద్కర్ వంటి రచనలతో పేరు పొందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు.
సత్యనారాయణ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కరప మండలంలోని గురజానపల్లి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైరయ్యారు. తనకిష్టమైన సాహిత్య రంగంలో ఉంటూ పలు రచనలు చేశారు. అలాగే, అక్షర సత్య సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.