నాలుగో టీ20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగో టీ20
- భారత జట్టులో రెండు మార్పులు
- ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్ ల మధ్య ఈ రోజు జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది.
టాస్ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, తమకు ఛాలెంజ్ లంటే ఇష్టమని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయాల్లో కూడా తాము అనేక మ్యాచుల్లో గెలిచామని తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చేశామని ఇషాన్ కిషన్, చాహల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్ లను తీసుకున్నామని చెప్పాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ, మొదటి మ్యాచ్ వికెట్ మళ్లీ తయారయిందని అన్నాడు. ఛేజింగ్ కు ఈ వికెట్ సహకరిస్తుందని చెప్పాడు. టీ20 సిరీస్ లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ వశమవుతుంది.