సీఐడీ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- అమరావతి భూముల విషయంలో ఆళ్ల ఫిర్యాదు
- కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ
- డీఎస్పీ సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ
అమరావతి అసైన్డ్ భూముల క్రయవిక్రయాల కేసులో ఏపీ సీఐడీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో, ఈరోజు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు.
సీఐడీ డీఎస్పీ సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోంది. రైతుల స్టేట్ మెంటును కూడా త్వరలోనే సీఐడీ రికార్డు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. కేసులో ఏ1గా చంద్రబాబును, ఏ2గా నారాయణను పేర్కొన్నారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.