జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

  • తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డి
  • తండ్రి విలువలు జగన్ లో కూడా ఉన్నాయని ప్రశంస
  • త్వరలోనే జగన్ ను కలుస్తానని వ్యాఖ్య
మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సత్తా చాటినా... తాడిపత్రిలో మాత్రం జేసీ సోదరులు తమ ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీకి అతీతంగా తమ సొంత ప్రాబల్యంతో మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించారు. ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి లాగానే జగన్ లో కూడా విలువలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు ఆ విషయాన్ని తాను స్పష్టంగా గమనించానని అన్నారు.

జగన్ సహకరించకపోతే ఈరోజు తాను మున్సిపల్ చైర్మన్ అయ్యేవాడిని కాదని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను జగన్ ను కలుస్తానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలతో కలిసి తాడిపత్రి అభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు.


More Telugu News