టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక భేటీ
- సీఐడీ పంపిన నోటీసులపై చర్చ
- మునిసిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ
- తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై చర్చ
టీడీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. కీలక అంశాలపై ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇందులో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి భూముల విషయంలో సీఐడీ పంపిన నోటీసులతో పాటు, ఇటీవల మునిసిపల్ ఎన్నికల ఫలితాల విశ్లేషణ, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై చర్చిస్తున్నారు.
కాసేపట్లో ఆయన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతోనూ సమీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పోటీలో నిలపాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి గురుమూర్తి పోటీలో నిలుస్తున్నారు.