రెండు రౌండ్ల తర్వాత కూడా ఆధిక్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
- రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానంలో హోరాహోరీ
- రెండో స్థానంలో రాంచందర్‌రావు
- ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్
తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మూడు రోజుల క్రితం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు మధ్య పోటీ నెలకొంది. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 17,439 ఓట్లు రాగా, రాంచందర్ రావుకు 16,385 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.
రెండో రౌండ్‌లోనూ దాదాపు అంతే ఓట్ల తేడాతో వాణీదేవీ ముందంజలో ఉన్నారు. ఇందులో సురభి వాణీ దేవికి 13,395 ఓట్లు రాగా, రాంచందర్ రావుకు 12,223 ఓట్లు వచ్చాయి. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా నాగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి, టీడీపీ అభ్యర్థి రమణ కొనసాగుతున్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.