పశ్చిమ బెంగాల్, అసోంలలో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

  • బెంగాల్ ప్రజలను కలుసుకోబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్
  • బెంగాల్‌లోని పురులియా, అసోంలోని కరీంగంజ్‌లో ప్రధాని ర్యాలీ
  • బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పశ్చిమ బెంగాల్, అసోంలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా, అసోంలోని కరీంగంజ్‌లలో నిర్వహించే ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేటి ఎన్నికల ప్రచారం గురించి మోదీ నిన్ననే ట్వీట్ చేశారు. బెంగాల్ ప్రజలను కలుసుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని, వారంతా మార్పును కోరుకుంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, బీజేపీ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో అసోంలో పలు రంగాల్లో సానుకూల మార్పులు వచ్చాయని, అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజల ఆశీస్సులు కోరుతున్నట్టు మోదీ పేర్కొన్నారు.


More Telugu News