గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తప్పిన పెను ప్రమాదం

  • కొత్త భవనం కోసం సెల్లార్ నిర్మాణం 
  • కూలిన పక్కనున్న భవనం 
  • అంతకుముందే బయటకు వెళ్లిన పదిమంది
  • ఒక వ్యక్తికి గాయాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పెనుప్రమాదం తప్పింది. కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్ తీస్తుండగా పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. ఈ ఘటనలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మపూర్‌కు చెందిన వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి.  ప్రమాదం జరగడానికి పది నిమిషాల క్రితమే ఆ భవనంలో ఉంటున్న పదిమంది బోరుబండి కార్మికులు బయటకు వెళ్లారు. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, పోలీసులు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ  ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


More Telugu News