హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక: తొలి రౌండ్‌లో వాణీదేవి ఆధిక్యం
- వాణీదేవికి తొలి రౌండ్‌లో 17,439 ఓట్లు
- రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు
- సరూర్ నగర్ స్టేడియంలో కొనసాగుతున్న లెక్కింపు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో నిలిచారు. ఆమెకు 17,439 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు వచ్చాయి.
ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి 5,082 ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. 3,57,354 ఓట్లు పోలయ్యాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కిస్తున్నారు.