నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించలేదు: బీహెచ్‌యూ వివరణ
- ప్రకటన విడుదల చేసిన వర్సిటీ
- అలాంటి ప్రతిపాదన కూడా రాలేదని వివరణ
- నిరసనల నేపథ్యంలో స్పందించిన యాజమాన్యం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించినట్లు వస్తున్న వార్తల్ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) ఖండించింది. అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని వర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన కూడా తమ ముందుకు రాలేదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
ప్రతిష్ఠాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సోషల్ సైన్స్ విభాగానికి నీతా అంబానీని విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించారని పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. దీంతో క్యాంపస్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది విద్యార్థులు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీ స్పందించి వివరణ ఇచ్చింది.