గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి

  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 30,716 శాంపిల్స్ పరీక్ష
  • 253 మందికి పాజిటివ్
  • గుంటూరు జిల్లాలో అత్యధికంగా 69 కేసులు
  • చిత్తూరు జిల్లాలో 39 మందికి పాజిటివ్
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరే ఏపీలోనూ కరోనా కేసులు నానాటికీ అధికమవుతున్నాయి. ముఖ్యంగా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 30,716 కరోనా పరీక్షలు నిర్వహించగా 253 మందికి పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 39 కొత్త కేసులు గుర్తించారు.

తూర్పు గోదావరి జిల్లాలో 29, విశాఖ జిల్లాలో 27, కర్నూలు జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, గుంటూరులో ఒకరు మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు 8,92,522 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,642 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,694కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 7,186కి చేరింది.


More Telugu News