దివ్యను మోసం చేసిన తాసిఫ్ పై కఠిన చర్యలు తీసుకోండి: కరాటే కల్యాణి

  • దివ్య అనే అమ్మాయి లవ్ జిహాద్ కు గురైంది
  • తాసిఫ్ ఆమెను ట్రాప్ చేసి మోసం చేశాడు
  • తలాక్ చెప్పి వెళ్లిపోయాడు
సినీ ఇండస్ట్రీలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై నటి కరాటే కల్యాణి పోరాటాలు చేసిన సంగతి తెలిసిందే. గోవుల అక్రమ తరలింపుపై కూడా ఆమె తన వంతు పోరాటం చేశారు. తాజాగా మరో పోరాటానికి ఆమె సిద్ధమయ్యారు. లవ్ జిహాద్ వల్ల మోసపోయిన అమ్మాయికి న్యాయం చేయాలని ఆమె పోరాడుతున్నారు.

 దివ్య అనే హిందూ అమ్మాయి లవ్ జిహాద్ కు గురయిందని... తాసిఫ్ అనే ముస్లిం యువకుడు ఆమెను ట్రాప్ చేసి మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత చిత్ర హింసలకు గురి చేశారని... ఇప్పుడు తలాక్ చెప్పి వెళ్లి పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News