నల్గొండలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆందోళన
- నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు
- టీఆర్ఎస్‌యేతర పార్టీల ఏజెంట్ల అనుమానాలు
- ఎనిమిది బ్యాలెట్ బాక్సులకు సీళ్లు లేవని నిరసన
తెలంగాణలోని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నల్గొండలోని అర్జాలబావికి సమీపంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తీరుపై టీఆర్ఎస్‌యేతర పార్టీల ఏజెంట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరో నంబరు గదిలోకి తెచ్చిన ఎనిమిది బ్యాలెట్ బాక్సులకు సీళ్లు లేవని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రం నుంచి వారందరూ బయటకు వచ్చి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. వారితో మాట్లాడిన పోలీసులు రిటర్నింగ్ అధికారి వద్దకు వారిని పంపి, ఆయనకు ఫిర్యాదు చేయమన్నారు.
మరోవైపు, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. జంబో బ్యాలెట్ పత్రాల దృష్ట్యా ఫలితాలు తేలేందుకు సుదీర్ఘ సమయం పట్టనుంది. కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.