ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా?: ధూళిపాళ్ల నరేంద్ర

  • రాజధాని భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగలేదు
  • ఆళ్ల  ఫిర్యాదు చేస్తే సీఐడీ అధికారులు కేసు నమోదు చేస్తారా?
  • కొత్త జగన్నాటకానికి తెరలేపారు
అమరావతి భూముల విషయంలో వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాజధాని భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగలేదని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అసత్య ప్రచారాలకు తెరతీశారని అన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు అవకాశం లేదని గతంలోనే హైకోర్టు తీర్పును వెలువరించిందని చెప్పారు. ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని అన్నారు.

బాధితులు కాకుండా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే సీఐడీ అధికారులు కేసు నమోదు చేస్తారా? అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. ఆళ్ల ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని మండిపడ్డారు. అమరావతిలో ఎస్సీలు ముందుండి రాజధాని ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ భూసేకరణ జరిగినా ఆందోళనలు జరిగాయని... కానీ అమరావతి రైతులు మాత్రం స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఆళ్ల కొత్త జగన్నాటకానికి తెర తీశారని చెప్పారు.


More Telugu News