తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నిక‌లు 
  • ఫ‌లితాలు రావడానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం
  • కౌంటింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తు  
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మూడు రోజుల క్రితం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.  బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రావడానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.  కౌంటింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నిక‌ల్లో ప‌లు పార్టీల అభ్య‌ర్థులే కాకుండా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గ‌ట్టి పోటీని ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప‌‌ల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న మ‌ధ్యే పోటీ నెల‌కొంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్, బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌ర్ రావు, టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవి మధ్య తీవ్ర పోటీ వుంది.


More Telugu News