మద్యం మత్తులో విమానంలో యువకుడి అసభ్య ప్రవర్తన... భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం
- మార్చి 9న డెన్వర్ వెళ్లేందుకు విమానం ఎక్కిన లాండన్ గ్రియర్
- విమానం ఎక్కేముందు నాలుగు బీర్లు తాగిన వైనం
- మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం
- కూర్చున్న సీట్లోనే మూత్ర విసర్జన
- 20 ఏళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం
అమెరికాలో ఓ యువకుడు విమానంలో ప్రయాణం చేస్తూ నానా రభస చేశాడు. ఇప్పుడతడు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల భారీ జరిమానాకు గురయ్యే అవకాశాలున్నాయి. 24 ఏళ్ల లాండన్ గ్రియర్ కొలరాడో ప్రాంతానికి చెందిన వ్యక్తి. మార్చి 9న సియాటిల్ నుంచి డెన్వర్ వెళ్లేందుకు అలాస్కా ఎయిర్ లైన్స్ విమానంలో ఎక్కాడు. అయితే, విమానం ఎక్కింది మొదలుకుని ప్రతి అంశంలోనూ విరుద్ధంగా వ్యవహరిస్తూ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాడు.
కరోనా నేపథ్యంలో మాస్కు ధరించమంటే నిద్ర పోతున్నట్టు నటించాడు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినిపించుకోనట్టే నిర్లక్ష్యం ప్రదర్శించాడు. అంతేకాదు ప్యాంట్ విప్పి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, తన సీట్లోనే మూత్రవిసర్జన చేశాడు. అసలు లాండన్ గ్రియర్ విమానం ఎక్కేముందే నాలుగు బీర్లు తాగాడట. ఇక ఆ మద్యం మత్తులో ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించాడు.
విమాన సిబ్బంది ఫిర్యాదుతో గ్రియర్ ను ఎఫ్ బీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై డెన్వర్ న్యాయస్థానంలో కేసు నమోదైంది. అతడి వికృత చేష్టలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 కోట్ల జరిమానా తప్పదని భావిస్తున్నారు.