నేడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్... ఫలితాలు ఇవాళ లేనట్టే!

  • ఈ నెల 14న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • భారీగా ఓటింగ్ నమోదు
  • నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • సుదీర్ఘంగా సాగనున్న కౌంటింగ్ ప్రక్రియ
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ కానుంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్.... ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో మొత్తం 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7,43,674 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా కౌంటింగ్ సుదీర్ఘంగా సాగనున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఇవాళ కష్టమేనని భావిస్తున్నారు. అందుకు రెండ్రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. నేటి రాత్రి 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్లను కట్టలు కట్టడానికే సరిపోతుందని, ఆ తర్వాతే తొలి రౌండ్ ఫలితం వెల్లడవుతుందని అంటున్నారు.


More Telugu News