ఎస్‌బీఐకి రూ.2 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ
- నిబంధనల ఉల్లంఘనే కారణం
- కమిషన్ రూపంలో ఉద్యోగులకు వేతనాలు
- తనిఖీల్లో బయటపడ్డ నిజాలు
- షోకాజ్ నోటీసుల జారీ
- వివరణను పరిశీలించిన తర్వాతే జరిమానా
నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)’ మంగళవారం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)’కు రెండు కోట్ల రూపాయల జరిమానా విధించింది. కమీషన్ రూపంలో బ్యాంకులు తమ ఉద్యోగులకు వేతనం ఇవ్వకూడదని ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం’లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు కమిషన్ రూపంలో ఉద్యోగులకు వేతనం చెల్లించడంతో ఆర్‌బీఐ ఆదేశాలను ఎస్‌బీఐ బేఖాతరు చేసినట్టయిందని తెలిపింది. అందుకే జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. ఆర్‌బీఐ చర్యలు పూర్తిగా నిబంధనలకు లోబడే ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని పేర్కొంది.
2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై తనిఖీ చేసిన తమకు ఉద్యోగుల వేతనాలు కమిషన్ రూపంలో చెల్లించినట్లు తేలిందని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో అప్పట్లోనే బ్యాంకుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపింది. బ్యాంకు వివరణ చూసిన తర్వాతే జరిమానా విధించాలని నిర్ణయించామని తెలిపింది.