టీఆర్ఎస్ పార్టీకో, బీజేపీకో బీ-టీమ్ లా ఉండాల్సిన అవసరం నాకు లేదు: షర్మిల
- తెలంగాణలో పార్టీ స్థాపనకు ఉరకలేస్తున్న షర్మిల
- నేడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం
- తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని స్పష్టీకరణ
- సమస్యల సాధన కోసమే రాజకీయ పార్టీ అని వెల్లడి
తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రచారం జరుగుతున్నట్టుగా, తాను టీఆర్ఎస్ పార్టీకో, బీజేపీకో, మరెవరికో బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం కూడా తనకు లేదని షర్మిల వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యల సాధన కోసమే తెలంగాణలో పార్టీ స్థాపిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. అంతేతప్ప, తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో షర్మిల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సభలోనే పార్టీ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.