రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన విమానం.. ఇద్దరు సజీవ దహనం
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
- భారీ ఎత్తున చెలరేగిన మంటలు
- మృతిచెందిన ఇరువురూ మహిళలే
- సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
సాధారణంగా రోడ్డు ప్రమాదం అంటే రెండు కార్ల మధ్యనో లేదా ఏవైనా రెండు వాహనాల మధ్యనో జరిగిందని అనుకుంటాం. కానీ, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కారుపై ఏకంగా విమానం కూలింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళితే... దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్ పెర్రీ విమానాశ్రయం నుంచి ఓకే ఇంజిన్ ఉండే ఓ చిన్న విమానం టేకాఫ్ అయ్యింది. అయితే, సాంకేతికత సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న కారుపై కుప్పకూలింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అగ్నికీలల్లో చిక్కుకున్నారు.
వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ అనూహ్య ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.