తిరుపతి ఉప ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

  • తిరుపతి ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
  • ఈ నెల 23న నోటిఫికేషన్
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • 3 లక్షల మెజారిటీ సాధిస్తామని పెద్దిరెడ్డి ధీమా
  • జగన్ వల్లే విజయాలు లభిస్తున్నాయని వ్యాఖ్య 
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలో ఇటీవల అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసీపీనే విజయం సాధించిందని, ఇప్పుడు లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ రికార్డు మెజారిటీ సాధిస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల మెజారిటీ ఖాయం అని స్పష్టం చేశారు. సీఎం జగన్ పరిపాలన వల్లే వైసీపీకి విజయాలు లభిస్తున్నాయని అన్నారు.

రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయని... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరపాలని ఎస్ఈసీని కోరతామని వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలకు ఈ నెల 23న నోటిఫికేషన్ వెలువడనుంది.


More Telugu News