ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. పూర్తి వివరాలు!
- గత 24 గంటల్లో కొత్తగా 261 కేసుల నమోదు
- గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు
- రాష్ట్రంలోని ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 1,579
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో సైతం నెమ్మదిగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 261 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41 కేసులు నమోదు కాగా... విశాఖపట్టణం జిల్లాలో 39 కేసులు, చిత్తూరు జిల్లాలో 37 కేసులు, కృష్ణా జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు గత 24 గంటల్లో ఒక్క కరోనా మృతి కూడా సంభవించకపోవడం గమనార్హం.
గత 24 గంటల్లో 125 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,92,269కి చేరుకుంది. మొత్తం 8,83,505 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి.