మోదీ ముఖ్య సలహాదారుడు సిన్హా రాజీనామా

  • పీకే సిన్హా రాజీనామా చేశారని వెల్లడించిన ఓ అధికారి
  • అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారన్న మరో అధికారి
  • ఇంత వరకు ధ్రువీకరించని ఆయన కార్యాలయం
ప్రధాని మోదీ ముఖ్య సలహాదారుడు పీకే సిన్హా రాజీనామా చేశారు. నిన్న (మార్చి 15) ఆయన రాజీనామా చేశారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. అయితే, రాజీనామా చేసిన విషయాన్ని ఆయన కార్యాలయం మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు, ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా వెల్లడి కాలేదు. అనారోగ్య కారణాల వల్లే సిన్హా రాజీనామా చేశారని మరో అధికారి వ్యాఖ్యానించారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో విధులకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన భావిస్తున్నారని చెప్పారు. సిన్హా సమర్థవంతమైన అధికారి అని కితాబిచ్చారు.

పీకే సిన్హా 1977 బ్యాచ్ కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత ఆయనకు కేబినెట్ సెక్రటరీగా సేవలందించారు. 2019లో రిటైర్ అయిన తర్వాత ఆయన కోసం ప్రధాని కార్యాలయంలో ఓఎస్డీ పేరుతో ప్రత్యేకంగా ఓ పదవిని సృష్టించడం గమనార్హం.


More Telugu News