తమిళనాడులో ఇప్పటి వరకు నామినేషన్ వేసిన వారిలో అత్యంత ధనవంతుడు కమలహాసన్!
- తన ఆస్తుల విలువను రూ. 176.9 కోట్లుగా పేర్కొన్న కమల్
- రూ. 131.9 కోట్ల స్థిరాస్తులు, రూ. 2.7 కోట్ల చరాస్తులు
- రూ. 2.7 కోట్ల విలువైన లెక్సస్ కారు ఉందన్న కమల్
ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన ఆస్తుల విలువ రూ. 176.9 కోట్లని ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పేర్కొన్నారు. రూ. 131.9 కోట్ల స్థిరాస్తులు, రూ. 2.7 కోట్ల చరాస్తులు ఉన్నాయని చెప్పారు. లండన్ లో రూ. 2.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని తెలిపారు. రూ. 2.7 కోట్ల విలువ చేసే లెక్సస్ కారు, రూ. 1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉన్నాయని వెల్లడించారు.
తనకు భార్య లేదని, తనపై ఆధారపడినవారు ఎవరూ లేరని తెలిపారు. తన విద్యార్హతను 8వ తరగతిగా కమల్ పేర్కొన్నారు. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి కమలహాసన్ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు, తమిళనాడులో ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో కమలహాసన్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.