చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై స్పందించిన నారా లోకేశ్!
- జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది
- అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని కోర్టు చివాట్లు పెట్టింది
- సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు
అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్ డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్.. చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేరని చెప్పారు.
'తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని నమ్మించడానికి వైఎస్ జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు?' అని లోకేశ్ ప్రశ్నించారు.
'21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది' అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.