స్టీరింగ్ వదిలేసి, కారుపై పుషప్స్.. పోలీసుల 'రివార్డ్'.. వీడియో ఇదిగో!
- కారు డ్రైవింగ్ ను వదిలేసి టాప్ పై పుషప్స్
- జరిమానా విధించిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు
- క్షమాపణ చెప్పిన యువకుడు
- నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో
పుషప్స్ ఇంట్లో కొట్టొచ్చు.. జిమ్ లో చేయొచ్చు.. పార్కులోనూ ప్రయత్నించొచ్చు. తప్పులేదు. కానీ, కారు పైన పుషప్స్ కొట్టడమే నేరం. ఆగి ఉన్న కారైతే ఫర్వాలేదు.. కానీ, కారు మాంచి స్పీడ్ మీద ఉన్నప్పుడు, స్టీరింగ్ వదిలేసి.. పైకొచ్చి కొట్టడమే ప్రమాదకరం.. నేరం కూడా! ఆ కారులో ఉన్న వారికే కాకుండా, ఆ దారిలో పోయే వారికి కూడా ఎంతో ప్రమాదం! ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉజ్వల్ యాదవ్ అనే యువకుడు అలాగే చేశాడు.
దానికి పోలీసులూ స్పందించారు. పుషప్స్ అయితే బాగానే కొట్టావ్.. మరి, మా రివార్డు వద్దా అంటూ జరిమానా చలానా పంపించారు. దానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘కొన్ని కొన్ని పుషప్ లు చట్టం కళ్లలో పడేలా చేస్తాయి. జర భద్రం’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో తర్వాత ఓ సందేశాన్నీ ఇచ్చారు.
‘‘డ్రైవింగ్ చేసేటప్పుడు స్టంట్స్ చేయడం నేరం. దాని వల్ల మీకు, ఎదుటి వారికి ప్రమాదకరం కావొచ్చు’’ అని పేర్కొంటూ వీడియోను ముగించారు. ఇక, చేసిన తప్పునకు ఉజ్వల్ యాదవ్ క్షమాపణ చెప్పాడు. కారుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన మాట నిజమేనని, ఇకపై ఎప్పుడూ ఇలా ప్రమాదకరంగా స్టంట్స్ చేయనని హామీ ఇచ్చాడు.