ఇప్పటికిప్పుడు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోం: ఆర్థిక మంత్రి నిర్మల
- ఇప్పటికైతే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు
- ప్రతిపాదన వస్తే అప్పుడు చూస్తాం
- లోక్‌సభకు నిర్మల లిఖిత పూర్వక సమాధానం
దేశంలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ఉత్పత్తుల ధరలకు కళ్లెం వేసేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని ఇటీవల పేర్కొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఇప్పటికిప్పుడు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని నిన్న లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
ఇప్పటి వరకైతే ఇలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని, వస్తే అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ పరిధి నుంచి పెట్రోలు, డీజిల్, విమాన ఇంధనం, గ్యాస్‌లను మినహాయించారు. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు విధిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతూ పోతున్నాయి.
కాగా, కేంద్రం గతేడాది పెట్రోలుపై రూ. 19.98, డీజిల్‌పై రూ.15,83 సుంకం విధించగా, ఇప్పుడు పెట్రోలుపై 32.90, డీజిల్‌పై 31.80 విధిస్తోంది. మళ్లీ వీటికి రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం.