మనకు నిర్మించడం ఎక్కడ తెలుసు.. అంతా అమ్మడమే తెలుసు కదా!: నిప్పులు చెరిగిన రాహుల్

  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తున్నట్టు వార్తలు
  • ప్రైవేటీకరణ ద్వారా ప్రజలు దారుణంగా నష్టపోతారన్న రాహుల్
  • మోదీ ఆప్తమిత్రులు మాత్రం బాగా లబ్ధి పొందుతారన్న కాంగ్రెస్ అగ్రనేత
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉన్న కొద్దిపాటి వాటాను పూర్తిగా విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ విమానాశ్రయాలను కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారంటూ గత రెండు రోజులుగా వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలా నిర్మించాలో తెలియదు కానీ, ఎలా అమ్మాలో మాత్రం బాగా తెలుసంటూ ట్వీట్ చేశారు. అన్నీ ప్రైవేటీకరించడం ద్వారా ప్రజల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని, అదే సమయంలో మోదీ ఆప్తమిత్రులు మాత్రం భారీగా లబ్ధిపొందుతారని అన్నారు. ఈ ట్వీట్‌కు రాహుల్ #indiaagainstprivatisation అనే హ్యాష్‌టాగ్‌ను జోడించారు.


More Telugu News