గెలిచినంత మాత్రాన చేసేవన్నీ మంచి పనులు అనలేం: సీపీఐ రామకృష్ణ

  • ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
  • ఎన్నికల అంశాన్ని పోలీసులకు అప్పగించారని ఆరోపణ
  • పోలీస్ స్టేషన్లలో బెదిరింపుల పర్వం నడిచిందని వెల్లడి
  • విపక్షాలపై విమర్శలు సరికాదని హితవు
ఏపీ మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. గెలిచారు కాబట్టి చేసేవన్నీ మంచి పనులు అనలేం అని స్పష్టం చేశారు. ఎన్నికల అంశాన్ని ప్రభుత్వం పోలీసులకు అప్పగించిందని, దాంతో  అభ్యర్థులు ఉపసంహరించుకునేలా పోలీస్ స్టేషన్లలోనే బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. విపక్షాలపై ప్రతి విషయంలోనూ విమర్శలు చేయడం సరికాదని అధికార పక్షానికి హితవు పలికారు.

అంతకుముందు, ప్రైవేటీకరణ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. లాభాల్లో ఉన్న బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకోవడం దారుణమని రామకృష్ణ విమర్శించారు.


More Telugu News