కులాహంకారంతో కలెక్టర్ ను ఎమ్మెల్యే కేతిరెడ్డి దూషించడం దారుణం: వర్ల రామయ్య
- కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
- గంధం చంద్రుడు చాలా మంచి వ్యక్తి అన్న వర్ల
- ఐఏఎస్ ల సంఘం స్పందించదా? అని ప్రశ్న
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గంధం చంద్రుడు అంత పనికిమాలిన కలెక్టర్ ను తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేతిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తప్పుపట్టారు.
కలెక్టర్ గంధం చంద్రుడు చాలా మంచి మనిషని, మానవతావాది అని, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని వర్ల రామయ్య అన్నారు. కులాహంకారం, అధికారమదంతో ఆయనను ధర్మవరం ఎమ్మెల్యే దూషించడం, కించపరచడం గర్హనీయమని చెప్పారు. బడుగువర్గాల పక్షాన నిలిచిన ఆయనను నిందించి రెడ్డిగారు తప్పు చేశారని అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి పట్ల దారుణంగా వ్యవహరించిన ఘటనపై ఐఏఎస్ సంఘం స్పందించదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిది మౌనమేనా? అని ట్వీట్ చేశారు.