కాంగ్రెస్ పార్టీకి దూరమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మూడు నెలలు కాంగ్రెస్ కు దూరంగా ఉంటానని ప్రకటించిన కొండా
- మూడు నెలల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వ్యాఖ్య
- బీజేపీలో చేరడం లేదన్న మాజీ ఎంపీ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి దూరం జరిగారు. మూడు నెలల పాటు కాంగ్రెస్ పార్టీకి తాను దూరంగా ఉండనున్నట్టు వెల్లడించారు. బీజేపీలో తాను చేరడం లేదని చెప్పారు. మూడు నెలల తర్వాత తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండేందుకు ఇన్ని రోజులు విశ్వేశ్వర్ రెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నిన్న ఎన్నిక ముగియడంతో తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఆయన... ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.