స‌మంత 'శాకుంత‌లం' సినిమా షూటింగ్ ప్రారంభం.. ఫొటోలు ఇవిగో!

  • గుణశేఖర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ 
  • వచ్చే వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ 
  • శకుంతల, దుష్యంతులుగా స‌మంత, దేవ్ మోహన్
'శాకుంతలం' పేరుతో దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.‌ పూజా కార్య‌క్ర‌మాల్లో వారంతా పాల్గొన్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం వచ్చే వారం నుంచి జరుగుతుందని తెలిపింది.
    
పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న‌ శాకుంత‌లం సినిమాలో స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, దుష్యంతుడి పాత్ర‌లో  దేవ్ మోహన్ న‌టిస్తున్నారని ఆ సినీ బృందం స్ప‌ష్టం చేసింది. వారిద్ద‌రి ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

             
అప్ప‌ట్లో అనుష్క‌తో 'రుద్రమదేవి' వంటి భారీ చిత్రాన్ని తీసిన గుణశేఖర్ ఇప్పుడు పాన్  ఇండియా మూవీ తీస్తుండ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు.
 
        


More Telugu News