టీఆర్ఎస్ కు పవన్ కల్యాణ్ మద్దతు పలకడంపై కొడాలి నాని స్పందన
- టీడీపీకి దగ్గరయ్యేందుకు బీజేపీని దూరం పెట్టారు
- తెలంగాణలో జనసేనకు బలం లేదు
- ఏపీలో ప్రతి ఎన్నికలో చిత్తుగా ఓడిపోతోంది
తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారశైలిపై నిన్న పవన్ కల్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కోసం జనసేన తెలంగాణలో త్యాగాలు చేసినప్పటికీ... ఆ పార్టీ నేతలు మాత్రం జనసైనికులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. తెలంగాణ జనసైనికుల విన్నపం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. పవన్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపింది.
ఈ సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకే పవన్ కల్యాణ్ బీజేపీని దూరం పెట్టారని అన్నారు. వాస్తవానికి తెలంగాణలో జనసేనకు ఎలాంటి బలం లేదని చెప్పారు. ఏపీలో ప్రతి ఎన్నికలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోతోందని ఎద్దేవా చేశారు. గతంలో వామపక్షాలు, బీఎస్పీని పవన్ దూరం పెట్టారని... ఇప్పుడు బీజేపీ వంతు వచ్చిందని అన్నారు.