'ఇదిగో నా సీత'.. అంటూ 'ఆర్ఆర్ఆర్‌'లో అలియాభ‌ట్ లుక్‌ను విడుద‌ల చేసిన చెర్రీ!

  • 'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్రలో అలియా భట్
  • పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన చరణ్ ‌
  • చీర క‌ట్టి, బొట్టు పెట్టిన అలియా భ‌ట్
'బాహుబ‌లి' త‌ర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న భారీ బ‌డ్జెట్‌ చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి అలియా భ‌ట్ లుక్ విడుద‌లైంది. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్.. ఈరోజు అలియా భ‌ట్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ లుక్‌ను విడుద‌ల చేశాడు.

ఈ సినిమాలో సీతారామరాజు (చెర్రీ)కి జోడీగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ, నా సీత ఇదిగో అంటూ చెర్రీ ఈ లుక్‌ను విడుద‌ల చేశారు. చీర క‌ట్టి, బొట్టు పెట్టి ఉన్న ఆమె లుక్ అల‌రిస్తోంది. రామ‌రాజు కోసం ఎదురుచూపులు చూస్తున్న‌ట్లు ఆమె కూర్చొని ఉంది.

కాగా, ఈ సినిమాలో  కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ న‌టిస్తుండ‌గా గ‌తంలో ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను 'ప్రియమైన జెన్నిఫర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ ఎన్టీఆర్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు  ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.


More Telugu News