తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ.. 2 వారాల పాటు నిర్వహించాలని నిర్ణయం
- ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
- ముగిసిన వెంటనే రేపటికి సమావేశాలు వాయిదా
- అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను రెండు వారాల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే రేపటికి సమావేశాలు వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది.
రేపు దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 19వ తేదీన సెలవు ఉంటుంది. ఆ తదుపరి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభమవుతాయి.
ఇదిలావుంచితే, అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెట్టారు. అలాగే, నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు మండలిలో తొలిసారి అడుగు పెడుతున్నారు.