నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
- అన్ని ఏర్పాట్లు పూర్తి
- కరోనా నిబంధనలు పాటిస్తూ బాలాలయంలో బ్రహ్మోత్సవాలు
- శృంగార డోలోత్సవంతో ముగియనున్న ఉత్సవాలు
అత్యంత భారీస్థాయిలో పునర్నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రధాన ఆలయం పునర్మిర్మాణంలో ఉన్నందున కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బాలాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది. ఆపై 22వ తేదీ ఉదయం 10 గంటలకు బాలాలయంలోనూ... రాత్రి 7.30 గంటలకు కొండ కింద ఉన్న పాత స్కూలు ఆవరణలోనూ లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తారు. 23న ఉదయం 11 గంటలకు దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు బాలాలయంలో, రాత్రి 7.30 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం నుంచి దేవస్థాన ప్రచార రథాన్ని ఊరేగిస్తారు. ఇక, 25వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.