ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ... ఉక్రెయిన్ సంస్థ ఆసక్తి
- దొనకొండలో రూ.24 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు
- ముందుకొచ్చిన ఏరో ట్రో పోలిస్ సంస్థ
- నాలుగు రకాల సేవలతో డీపీఆర్
- 10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
ఏపీకి మరో భారీ పరిశ్రమ రానుంది. ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఉక్రెయిన్ కు చెందిన ఓ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. దొనకొండలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏరో ట్రో పోలిస్ అనే సంస్థ పరిశ్రమ స్థాపనకు సిద్ధమైంది. ఇండో-ఉక్రెయిన్ టెక్నాలజీ ఎక్చేంజ్ ప్రోగ్రామ్ పేరిట ఈ ప్రాజెక్టు నెలకొల్పనుంది.
ఈ సంస్థ 4 రకాల సేవలతో డీపీఆర్ సిద్ధం చేసింది. విమానాల తయారీ, సర్వీసింగ్, శిక్షణ, అంతర్జాతీయ రవాణా సేవలు అందించనుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయ్యే అవకాశం ఉంది. 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.