పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో డీఎంకే జెండా ఊపిన నేత

  • పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
  • కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంపకం చర్చలు
  • తనకు సీటు దక్కదేమోనని భావించిన కాంగ్రెస్ నేత వెంకటేశన్
  • పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
  • డీఎంకే జెండా చేతబూని సమావేశానికి వచ్చిన వైనం
  • రసాభాసగా మారిన సమావేశం
పుదుచ్చేరి ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరిగిన నేపథ్యంలో తనకు టికెట్ దక్కుతుందో, దక్కదో అని భావించిన కాంగ్రెస్ నేత వెంకటేశన్ పార్టీ సమావేశంలో డీఎంకే జెండా ఊపడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ ఘటన జరిగింది. దాంతో ఆ సమావేశం కాస్తా రసాభాస అయింది.

వెంకటేశన్ ను అడ్డుకునేందుకు ఓ నాయకుడు ప్రయత్నించగా, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎన్నికలపై చర్చించడానికి నిర్వహించిన ఆ సమావేశం బాహాబాహీకి వేదికగా మారింది. వేదికపై పార్టీ అగ్రనేతలు ఉండగానే పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు తమ కండబలం చూపించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తోంది.


More Telugu News