విదేశీ మారకద్రవ్యం నిల్వల్లో రష్యాను అధిగమించిన భారత్
- ఆర్థిక శక్తిగా భారత్
- గణనీయంగా బలపడిన విదేశీ మారకద్రవ్యం
- ఇటీవల కాలంలో 4.3 బిలియన్ డాలర్ల తరుగుదల
- అయినప్పటికీ రష్యాను దాటేసిన భారత్
- ప్రపంచంలో నాలుగోస్థానానికి ఎగబాకిన భారత్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ ఆ దిశగా మరో కీలక పరిణామం నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్యం నిల్వల్లో రష్యాను అధిగమించింది. తద్వారా ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారకద్రవ్యం కలిగివున్న దేశాల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మార్చి 5 నాటికి విదేశీ మారక నిల్వల్లో 4.3 బిలియన్ డాలర్ల మేర తరుగుదల నమోదైనప్పటికీ... 580.3 బిలియన్ డాలర్లతో రష్యా (580.1 బిలియన్ డాలర్లు)ను అధిగమించింది.
అత్యధిక విదేశీ మారకద్రవ్యం నిల్వలతో చైనా అగ్రస్థానంలో ఉండగా, జపాన్, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ వద్ద భారీస్థాయిలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు ఉన్న అంశం విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతుందని, అంతర్జాతీయ స్థాయిలో రుణాలు పొందేందుకు వీలు కల్పించే క్రెడిట్ రేటింగ్ కంపెనీలు కూడా సంతృప్తి చెందుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.