విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ పాగా... 58 డివిజన్లలో జయభేరి
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
- 11 కార్పొరేషన్లలోనూ వైసీపీ జోరు
- విశాఖ కార్పొరేషన్ లో విపక్షాలను వెనక్కినెట్టిన వైసీపీ
- టీడీపీకి 30 డివిజన్లలో విజయం
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఎదురులేకుండా పోయింది. తాజాగా విశాఖ నగరపాలక సంస్థ కూడా వైసీపీ ఖాతాలోకే చేరింది. జీవీఎంసీలో 98 డివిజన్లు ఉండగా, 58 డివిజన్లలో వైసీపీ విజయదుందుభి మోగించింది. తద్వారా విశాఖ కార్పొరేషన్ లో పాగా వేసింది.
అటు, టీడీపీకి 30 డివిజన్లలో విజయం దక్కగా, జనసేన 3 స్థానాల్లో నెగ్గింది. ఇతరులకు 4 డివిజన్లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఒక్కొక్క స్థానం గెలుచుకున్నాయి. అటు, చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలోనూ వైసీపీనే విజయలక్ష్మి వరించింది.