మునిసిపల్ ఎన్నికల ఫలితాలు.. వైసీపీ హవా
- అనంతపురం కార్పొరేషన్ లో 29 స్థానాలు వైసీపీ కైవసం
- ధర్మవరంలో 40 వార్డుల్లోనూ వైసీపీ విజయం
- మైదుకూరు మునిసిపాలిటీలో మాత్రం టీడీపీ హవా
- మైదుకూరులో టీడీపీ 12, వైసీపీ 11, ఓ చోట జనసేన విజయం
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. అనంతపురం కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 29 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మిగతా వాటిలో ఫలితాలు రావాల్సి ఉంది. ఇక ధర్మవరంలో 40 వార్డుల్లోనూ వైసీపీ విజయం సాధించింది. మైదుకూరు మునిసిపాలిటీలో మాత్రం వైసీపీ కంటే టీడీపీ ఒక వార్డు ఎక్కువగా గెలిచింది. మైదుకూరులో టీడీపి 12, వైసీపీ 11, ఓ చోట జనసేన విజయం సాధించాయి.
విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ హవా కొనసాగింది. వైసీపీ 27, టీడీపీ 14, జనసేన, స్వతంత్రులు, సీపీఎం అభ్యర్థులు ఒక్కో డివిజన్లలో గెలుపొందారు. విజయనగరం కార్పొరేషన్ లో ఇప్పటివరకు 11 డివిజన్లలో వైసీపీ గెలుపొందింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో ఆ పార్టీ విజయం సాధించింది.