గ్యాస్ సిలిండ‌ర్‌కు మొక్కి వ‌చ్చి ఓటేశాన‌న్న కేటీఆర్‌కు రాంచంద్రరావు చుర‌క‌లు

  • ఓయూ నిరుద్యోగి ఎల్లస్వామికి మొక్కి వ‌చ్చాను
  • ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ త్వరగా రావాలని దేవుడికి మొక్కాను
  • పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నాను
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ  పోలింగ్ లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌... ఈ సంద‌ర్భంగా దేశంలో పెరుగుతోన్న వంట‌ గ్యాస్ ధ‌ర‌ల‌ను గుర్తుకు తెస్తూ.. ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశాన‌న్న విష‌యం తెలిసిందే.

టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు కూడా ఓటు వేసే ముందు త‌మ ఇళ్ల‌ల్లో గ్యాస్ సిలిండ‌ర్‌కు దండం పెట్టి వెళ్తూ సామాజిక మాధ్య‌మాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్‌కు  బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. రామచంద్రరావు చుర‌క‌లంటించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ, పీఆర్సీ అమ‌లు విష‌యంలో క‌న‌బ‌ర్చుతోన్న తీరును ఆయ‌న ప‌రోక్షంగా గుర్తు చేస్తూ.. ఓయూ నిరుద్యోగి ఎల్లస్వామికి మొక్కి ఎమ్మెల్సీ ఓటు వేశానని చెప్పారు. అలాగే,  ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ త్వరగా రావాలని దేవుడికి మొక్కుకొని వ‌చ్చి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నాన‌ని చుర‌క‌లంటించా‌రు.


More Telugu News