ఓటు హ‌క్కు వినియోగించుకున్న పెళ్లి కూతురు!

  • తెలంగాణ‌లో కొనసాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్
  • ఓటు వేసేందుకు వ‌చ్చిన‌ మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్మాయి
  • అనంత‌రం పెళ్లి చేసుకునేందుకు ఫంక్ష‌న్ హాల్‌కు
తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఓట‌ర్లు ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువ‌తి కాసేప‌ట్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేసింది. ఫిర్దోస్‌ బేగం అనే యువ‌తి కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓట‌ర్లకు స్ఫూర్తినిచ్చింది. ఓటు వేసిన అనంత‌రం అక్క‌డి నుంచి పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్‌‌ హాలుకు వెళ్లింది.

కాగా, ప‌లు ప్రాంతాల్లో ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రావ‌డం లేదు. ముఖ్యంగా హైద‌రాబాద్ లో ప‌లు కేంద్రాలు ఖాళీగా క‌న‌ప‌డుతున్నాయి. ఆదివారం రోజు సెల‌వు ఉన్న‌ప్ప‌టికీ వారు ఓటు హ‌క్కును వినియోగించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వీఐపీ, సెలెబ్రిటీలు అధికంగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో ప్ర‌ముఖులు క‌న‌ప‌డ‌ట్లేదు.


More Telugu News