పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కొన్ని రోజులుగా విరామం!
- ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.91.17
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.79
- డీజిల్ ధర లీటరుకు రూ.88.86
దేశంలో వరుసగా పెరుగుతూ వచ్చి సామాన్యుడిని ఆందోళనలకు గురి చేసిన పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. రెండు వారాల నుంచి వాటి ధరల్లో పెరుగుదల కనపడట్లేదు. అలాగే, వాటి ధరలు తగ్గలేదు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.91.17, డీజిల్ ధర రూ.81.47గా ఉంది.
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.79గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.88.86గా కొనసాగుతోంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, బీకనెర్‌లో పెట్రోల్ లీటరు ధర రూ.100 దాటింది. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.100.01, డీజిల్ ధర రూ.92.09గా కొనసాగుతోంది.