బీజేపీని గెలిపించారో మీ భూములు కార్పొరేట్ కంపెనీలకే: రాకేశ్ తికాయత్
- కోల్‌కతా, నందిగ్రామ్‌లలో ‘కిసాన్ మహాపంచాయత్’
- బీజేపీ సంపన్నుల పక్షపాతి
- రైతు ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది
మరికొన్ని రోజుల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గనుక గెలిస్తే పేదల భూములు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కాబట్టి బీజేపీని ఓడించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కోల్‌కతా, నందిగ్రామ్‌లలో కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం రైతుల వెన్ను విరుస్తోందని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని అణచివేయాలని చూస్తోందని రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే మిమ్మల్ని భూమిలేని నిరుపేద రైతులుగా మార్చేస్తుందని హెచ్చరించారు. మోసాలకు బీజేపీ మారుపేరని, అది సంపన్నుల కొమ్ముకాసే పార్టీ అని దుయ్యబట్టారు. కాగా, ఈ మహాపంచాయత్‌లో సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు.