బాంబ్ బ్లాస్ట్ శబ్దం కంటే తుమ్మితేనే వణికిపోతున్నాం: సద్గురు జగ్గీ వాసుదేవ్

  • మనం జీవించి ఉన్నామంటే దానికి వ్యాక్సిన్లే కారణం
  • జీవితం క్షణభంగురమన్న విషయాన్ని ఇప్పుడందరూ గ్రహిస్తున్నారు
  • మృత్యువును అనుభవంలోకి తెచ్చుకుంటే శరీరం శాశ్వతం కాదన్న విషయం అర్థమవుతుంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచమంతా బాంబ్ బ్లాస్ట్ కంటే తుమ్మితేనే ఎక్కువ భయపడుతోందని అన్నారు. జీవితం క్షణభంగురమన్న విషయాన్ని ఇప్పుడు అందరూ గ్రహిస్తున్నారని అన్నారు. చాలా రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు చిన్నప్పటి నుంచి ఎన్నో టీకాలు తీసుకున్నామని, ఇప్పుడు బతికి ఉన్నామంటే అదే కారణమని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతీయుల సగటు ఆయుర్థాయం 28 ఏళ్లుగా మాత్రమే ఉండేదని, నాటి పరిస్థితులు ఇప్పటికీ కొనసాగి ఉంటే మనలో ఎవరూ ఇప్పుడు జీవించి ఉండేవారు కాదని అన్నారు. ఆధునిక కాలంలో మెడిసిన్ అనేది లేకుంటే మనం ఫ్లూని కూడా ఓడించలేకపోయేవారమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ లేకుంటే జీవితమే లేదని అన్నారు.

మనం చనిపోవడానికి కేన్సరే కారణం కానక్కర్లేదని, గట్టిగా తుమ్మినా చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. మృత్యువును అనుభవంలోకి తెచ్చుకుంటే శరీరం శాశ్వతం కాదన్న విషయం అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. మన వద్ద ఎక్కువ సమయం లేదని గ్రహించగలిగితే ఉన్న సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోగలుగుతామని సద్గురు వివరించారు.


More Telugu News